Sunday, February 20, 2022

Friday, February 18, 2022

Digital Vaikuntapali Project - Brief Description in Telugu

వైకుంఠపాళి ప్రణాళిక - తెలుగులో క్లుప్తముగా


కంప్యూటర్ మీద గాని , ఇంటర్నెట్ లో గాని ఆడుకునేందుకు  వైకుంఠపాళి ఆటను అమెరికాలొ తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము.  


పూర్వం, అంటే ఓ అరవై డెబ్బయి  ఏళ్ల క్రిందట అత్తలు మామ్మలు మేము వైకుంఠపాళి ఆట ఆడుతూవుంటే మంచి చెడూ ఎలాగ నిచ్చెనల లాగా పాములు లాగా మనల్ని ముందుకు వెనకకు తీసుకు వెళతాయో చెప్పేవారు. దానితో పిల్లలకు మంచి చెడు విచక్షణ నేర్ప గలిగేవారు. ఇప్పుడు సమష్టి కుటుంబాలు లేకపోవడముతో ఆ అవకాశము పోయింది.


పిల్లలు కంప్యూటర్ల మీద ఏవో పిచ్చి ఆటల్లో పడ్డారు.


అయితే ఆలోచించి తయారు చేస్తే వైకుంఠపాళి ఆట మళ్ళీ పూర్వము లాగ మంచి చెడులను విచక్షణను నేర్ప గలదు.


ఇదే మా లక్ష్యం!    

  

పిల్లలు ఆట ఆడుతున్నప్పుడు ప్రతి గడి కి వాళ్ళ పిక్క (pawn) వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న సందేశం ఇవ్వ బడుతుంది. ఆ సందేశం బొమ్మ (picture) గా గాని, వ్రాత (text) గా గాని, ఆడియో (audio) లేక విడియో (video) మాధ్యమం (medium) లొ గాని వస్తుంది.


చిన్న పిల్లలకి, కొంచము పెద్దవాళ్ళకి, వాళ్ళకి తగినట్లు సందేశం అందుతుంది. 


ఇప్పటికి Okalahoma State University లో ఉత్తమ విద్యలో వున్న ముగ్గురు విద్యార్థులు computer program తయారు చేస్తున్నారు. శ్రమ దానం చేస్తున్నారు. 

తదితరుల సహాయము కూడా రాబోతున్నది. 


కావలసినది:

మాకు ఒక్కొక్క గడి కి తగిన సందేశం కావాలి.


సందేశము దైవిక ఆధ్యాత్మిక విజ్ఞానం తెలిసిన వారు  వ్రాస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. 


బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు వైకుంఠపాళి మీద ఒక ప్రవచనములో చాల చక్కగా విశదంగా చెప్పేరు. అహం వున్న వాడు మళ్ళీ కొంత పతనమయి క్రిందకు వెళతాడని స్పష్టం చేసారు. 


అదే విధంగా వారు తదితర పాములకు నిచ్చెనలకు సందేశాలు చెప్తే వైకుంఠపాళి ఆట కంప్యూటర్ మీద రాణిస్తుంది. 


ఆ సందేశాలను తదితర భారతీయ భాషలలోనికి తర్జుమా చేసి వైకుంఠపాళి ఆటను భారత దేశమంతటా దొరికే విధానానికి ప్రయత్నిస్తాము. 


మళ్ళీ మన పిల్లలకు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన వచ్చే అవకాశం వుంటుందని ఆశిస్తున్నాము.


చివరికి ఈ ఆట ను ఒక భారతీయ ధర్మ సంస్థ కు అప్పగించాలని మా వుద్దేశ్యము. ఆ సంస్థ వైకుంఠపాళి ఆటను తర తరాలుగా  పిల్లలకు అంద చేసి వాళ్ళ రూపు రేఖలను ధర్మ శాస్త్ర పరంగా తిప్ప గలదని మా ఆశ.


మీ సహాయం అర్ధిస్తున్నాము. మీ ధనసహాయము అడగడము లేదు. కొన్ని గళ్ళకు (squares) చిన్న సందేశాలు వ్రాయగలరని ఆశిస్తున్నాము.


ఒక నమూనా పొందు పరచి పంపుతున్నాము. 


మీ సహాయము ఈ ఆటను త్వరగా పూర్తి చేయగలదు. 


మీ వ్రాత గాని ఆడియో లేక విడియో గాని పంపించండి.


నమస్తే! 


ఇట్లు విధేయుడు,


సోమయాజులు కారంచేటి, Potomac, Maryland, USA   

తదితరులు 


Thursday, February 3, 2022

వైకుంఠపాళి ఆట - గడి 121 => 99

 

Subject: వైకుంఠపాళి ఆట - గడి 121 => 99

నమూనా (Sample):  అహంకారము అంటే గర్వము. అది మంచి గుణము కాదు.

అహంకారము అంటే ఏమిటి? 

This is the Text or write-up for Square number 121 on the Vaikuntapali Board.

The same content may also be presented as Audio and/or video for the game.

భాగవతములో చిత్రకేతుని కధలో అహంకారం గురించి చెప్పబడిందిఅహంకారము అంటే అన్నీ నాకే తెలుసునా కన్నా తెలివైనవారు లేరునేను బలవంతుడినినేను అందరికన్నా శక్తిగల వాడిని, నేను విజ్ఞానిని, అని గర్వించి మాట్లాడడము, విర్ర వీగి ప్రవర్తిస్తూ, యితరులను అవమానించడమోనిందించడమోగాయపరచడమోబాధ పెట్టడమో, హింసించడమో చెయ్యడము అహంకార లక్షణాలు. అలా చేస్తే, ఆ వ్యక్తి అహంకారం చూపిస్తున్నాడన్న మాట. ఇది చాల తప్పు నడవడికమనిషికి అహంకారము ఉండ కూడదు. 

 ఇతరులను గౌరవించడమువారితో మర్యాదగా స్నేహభావముతో మాట్లాడడము అహంకారము లేని వారు ప్రదర్శించే మంచి పద్ధతి.

జీవితంలో వేరే ఎంత మంచి పనులు చేసినా అహంకారి అధోగతి పాలవుతాడు.

చిత్రకేతుడు మిక్కిలి  శాంతస్వభావం కల వాడులోకాతీతులైన మహానుభావులతో సమానుడువిష్ణుభక్తుడు. కాని, చిత్రకేతుడు జితేంద్రియుడ నన్న అహంకారంతో జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి పరిహసించేడు. పార్వతీదేవి కోపగించుకొని, "నీ అహంకారమునకు ఫలముగా పాపకార్యాలకు  నెలవైన రాక్షసుడిగా జన్మించు. ఇక ముందైనా మహానుభావులైన వారిని అవమానించకు," అని శపించింది.

అతడే వృత్రాసురుడు అనే రాక్షసుడు గా జన్మించేడు.

క్లుప్తముగా చెప్పాలంటే, అహంకారము అంటే గర్వము. అది మంచి ప్రవర్తన కాదు.

ఈ ఆటలో 121వ గడి నుండి 99వ గడికి దిగి పోవాలి. అంటే అధోగతి (క్రిందకు పోవడము) వస్తుంది అన్నమాట.

 ఆధారము: పోతన భాగవతము, తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురణ, ఆరవ స్కంధము - చిత్రకేతూపాఖ్యానము పేజీ 502 మొదలు; వృత్రాసుర వృత్తాంతము పేజీ 462 మొదలు.

Wednesday, February 2, 2022

Cycles: Events Repeat and not Sequential in Nature

 Cycles: Events Repeat and not Sequential in Nature

The New Year has come and a month has already gone. The weekend has come and even half of the week is gone.
Most of the time, we seemed to be looking at events and happenings in linear terms while they are actually cyclic.
Being earthlings, we measure distances in linear terms - miles, feet, kilometers, meters and so on while the earth on which we live is round rather than flat. We actually travel along an arc, a small one or a large one. It comes from our millenniums ago concept of a flat earth.

We work in Cartesian coordinates. Perhaps, spherical coordinates would have been very difficult to comprehend and do calculations.

As was thinking about cycles, I ran into my old draft in my archives. I am reproducing it below here.

Cycles - small and big

Som Karamchetty

11/12/2002

 

The heavens move in cycles and so do the atoms.

Many things in between are cyclic.

 

Our earth rotates at one cycle per year, i.e 365.25 * 24 * 3600 seconds around the Sun.

 

The earth rotates around itself once a day, i.e. 24 * 3600 seconds.

 

Sun has a cycle, so do all the planets.

 

We get 60 or 50 Hertz electric supply.

 

Our cell phones, garage doors, and the TV remote operate at several hundred mega Hertzs.

 

A battery supplies DC electricity, i.e. there is no period. Alternatively a cycle takes infinitely long time (or infinite seconds).

 

When a wave form is not harmonic, Fourier analysis is conducted and the various frequencies are determined.

 

A so called DC supply can actually be broken into harmonics if we have a beginning (zero) and an ending zero to the supply.

 

Light has certain frequencies.

 

A philosophical question is, what are the lowest and highest frequencies? God only knows, perhaps.

 

 

Crops come in cycles. There is a season when harvesting is done. The produce is stored or otherwise treated. It is consumed over a different cycle.

 

As an example, consider the growing of wheat. Wheat is harvested once a year (in a particular location at least). Then it processed and ultimately converted to bread (or other products). These products are consumed at a different frequency. It is approximately, 365 * 3 (assuming three bread meals a day).

 

Cows give milk at a certain frequency (twice a day), hen lay eggs once a day, and so on. People consume foods thrice a day (not counting the occasional munchies).

 

Electricity is produced in cycles and consumed in other cycles.

 

Water is gained from a cyclic rain and is consumed in a (approximate) cyclic fashion.

 -0-