వైకుంఠపాళి ప్రణాళిక - తెలుగులో క్లుప్తముగా
కంప్యూటర్ మీద గాని , ఇంటర్నెట్ లో గాని ఆడుకునేందుకు వైకుంఠపాళి ఆటను అమెరికాలొ తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము.
పూర్వం, అంటే ఓ అరవై డెబ్బయి ఏళ్ల క్రిందట అత్తలు మామ్మలు మేము వైకుంఠపాళి ఆట ఆడుతూవుంటే మంచి చెడూ ఎలాగ నిచ్చెనల లాగా పాములు లాగా మనల్ని ముందుకు వెనకకు తీసుకు వెళతాయో చెప్పేవారు. దానితో పిల్లలకు మంచి చెడు విచక్షణ నేర్ప గలిగేవారు. ఇప్పుడు సమష్టి కుటుంబాలు లేకపోవడముతో ఆ అవకాశము పోయింది.
పిల్లలు కంప్యూటర్ల మీద ఏవో పిచ్చి ఆటల్లో పడ్డారు.
అయితే ఆలోచించి తయారు చేస్తే వైకుంఠపాళి ఆట మళ్ళీ పూర్వము లాగ మంచి చెడులను విచక్షణను నేర్ప గలదు.
ఇదే మా లక్ష్యం!
పిల్లలు ఆట ఆడుతున్నప్పుడు ప్రతి గడి కి వాళ్ళ పిక్క (pawn) వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న సందేశం ఇవ్వ బడుతుంది. ఆ సందేశం బొమ్మ (picture) గా గాని, వ్రాత (text) గా గాని, ఆడియో (audio) లేక విడియో (video) మాధ్యమం (medium) లొ గాని వస్తుంది.
చిన్న పిల్లలకి, కొంచము పెద్దవాళ్ళకి, వాళ్ళకి తగినట్లు సందేశం అందుతుంది.
ఇప్పటికి Okalahoma State University లో ఉత్తమ విద్యలో వున్న ముగ్గురు విద్యార్థులు computer program తయారు చేస్తున్నారు. శ్రమ దానం చేస్తున్నారు.
తదితరుల సహాయము కూడా రాబోతున్నది.
కావలసినది:
మాకు ఒక్కొక్క గడి కి తగిన సందేశం కావాలి.
సందేశము దైవిక ఆధ్యాత్మిక విజ్ఞానం తెలిసిన వారు వ్రాస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము.
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు వైకుంఠపాళి మీద ఒక ప్రవచనములో చాల చక్కగా విశదంగా చెప్పేరు. అహం వున్న వాడు మళ్ళీ కొంత పతనమయి క్రిందకు వెళతాడని స్పష్టం చేసారు.
అదే విధంగా వారు తదితర పాములకు నిచ్చెనలకు సందేశాలు చెప్తే వైకుంఠపాళి ఆట కంప్యూటర్ మీద రాణిస్తుంది.
ఆ సందేశాలను తదితర భారతీయ భాషలలోనికి తర్జుమా చేసి వైకుంఠపాళి ఆటను భారత దేశమంతటా దొరికే విధానానికి ప్రయత్నిస్తాము.
మళ్ళీ మన పిల్లలకు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన వచ్చే అవకాశం వుంటుందని ఆశిస్తున్నాము.
చివరికి ఈ ఆట ను ఒక భారతీయ ధర్మ సంస్థ కు అప్పగించాలని మా వుద్దేశ్యము. ఆ సంస్థ వైకుంఠపాళి ఆటను తర తరాలుగా పిల్లలకు అంద చేసి వాళ్ళ రూపు రేఖలను ధర్మ శాస్త్ర పరంగా తిప్ప గలదని మా ఆశ.
మీ సహాయం అర్ధిస్తున్నాము. మీ ధనసహాయము అడగడము లేదు. కొన్ని గళ్ళకు (squares) చిన్న సందేశాలు వ్రాయగలరని ఆశిస్తున్నాము.
ఒక నమూనా పొందు పరచి పంపుతున్నాము.
మీ సహాయము ఈ ఆటను త్వరగా పూర్తి చేయగలదు.
మీ వ్రాత గాని ఆడియో లేక విడియో గాని పంపించండి.
నమస్తే!
ఇట్లు విధేయుడు,
సోమయాజులు కారంచేటి, Potomac, Maryland, USA
తదితరులు
No comments:
Post a Comment