Thursday, February 3, 2022

వైకుంఠపాళి ఆట - గడి 121 => 99

 

Subject: వైకుంఠపాళి ఆట - గడి 121 => 99

నమూనా (Sample):  అహంకారము అంటే గర్వము. అది మంచి గుణము కాదు.

అహంకారము అంటే ఏమిటి? 

This is the Text or write-up for Square number 121 on the Vaikuntapali Board.

The same content may also be presented as Audio and/or video for the game.

భాగవతములో చిత్రకేతుని కధలో అహంకారం గురించి చెప్పబడిందిఅహంకారము అంటే అన్నీ నాకే తెలుసునా కన్నా తెలివైనవారు లేరునేను బలవంతుడినినేను అందరికన్నా శక్తిగల వాడిని, నేను విజ్ఞానిని, అని గర్వించి మాట్లాడడము, విర్ర వీగి ప్రవర్తిస్తూ, యితరులను అవమానించడమోనిందించడమోగాయపరచడమోబాధ పెట్టడమో, హింసించడమో చెయ్యడము అహంకార లక్షణాలు. అలా చేస్తే, ఆ వ్యక్తి అహంకారం చూపిస్తున్నాడన్న మాట. ఇది చాల తప్పు నడవడికమనిషికి అహంకారము ఉండ కూడదు. 

 ఇతరులను గౌరవించడమువారితో మర్యాదగా స్నేహభావముతో మాట్లాడడము అహంకారము లేని వారు ప్రదర్శించే మంచి పద్ధతి.

జీవితంలో వేరే ఎంత మంచి పనులు చేసినా అహంకారి అధోగతి పాలవుతాడు.

చిత్రకేతుడు మిక్కిలి  శాంతస్వభావం కల వాడులోకాతీతులైన మహానుభావులతో సమానుడువిష్ణుభక్తుడు. కాని, చిత్రకేతుడు జితేంద్రియుడ నన్న అహంకారంతో జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి పరిహసించేడు. పార్వతీదేవి కోపగించుకొని, "నీ అహంకారమునకు ఫలముగా పాపకార్యాలకు  నెలవైన రాక్షసుడిగా జన్మించు. ఇక ముందైనా మహానుభావులైన వారిని అవమానించకు," అని శపించింది.

అతడే వృత్రాసురుడు అనే రాక్షసుడు గా జన్మించేడు.

క్లుప్తముగా చెప్పాలంటే, అహంకారము అంటే గర్వము. అది మంచి ప్రవర్తన కాదు.

ఈ ఆటలో 121వ గడి నుండి 99వ గడికి దిగి పోవాలి. అంటే అధోగతి (క్రిందకు పోవడము) వస్తుంది అన్నమాట.

 ఆధారము: పోతన భాగవతము, తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురణ, ఆరవ స్కంధము - చిత్రకేతూపాఖ్యానము పేజీ 502 మొదలు; వృత్రాసుర వృత్తాంతము పేజీ 462 మొదలు.

No comments:

Post a Comment